తెల్లవారిపై తొలుత పోరాడింది గిరిజనులే: గవర్నర్‌ తమిళిసై

బ్రిటిషర్లకు వ్యతిరేకంగా తొలుత తిరుగుబాటు, పోరాటం చేసింది గిరిజనులేనని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలలో భాగంగా ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వనవాసీ కల్యాణ్‌ పరిషత్‌, జాతీయ గిరిజన

Published : 10 Aug 2022 04:49 IST

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: బ్రిటిషర్లకు వ్యతిరేకంగా తొలుత తిరుగుబాటు, పోరాటం చేసింది గిరిజనులేనని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలలో భాగంగా ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వనవాసీ కల్యాణ్‌ పరిషత్‌, జాతీయ గిరిజన కమిషన్‌, ఓయూ గిరిజన అధ్యాపకులు, విద్యార్థుల ఆధ్వర్యంలో వర్సిటీలో సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథి తమిళిసై మాట్లాడుతూ..గిరిజనులతోనే దేశంలో అడవుల సంరక్షణ సాధ్యపడుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను వారు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. వారికి నైతిక ధైర్యం ఇచ్చేందుకే భద్రాచలంలోని వరద ప్రాంతాలను సందర్శించానన్నారు. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో అందరూ పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. పాలమూరు విశ్వవిద్యాలయ వీసీ ప్రొ.లక్ష్మీకాంత్‌ రాథోడ్‌, సామాజిక సామరస్యత మంచ్‌ కన్వీనర్‌ అప్పాల ప్రసాద్‌, ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొ.లక్ష్మీనారాయణ, వనవాసీ కల్యాణ్‌ పరిషత్‌ ఉపాధ్యక్షులు వెంకటయ్య, విద్యార్థి నాయకులు కమల్‌సురేష్‌, రమేష్‌నాయక్‌, కోటేశ్వర్‌, సైదులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని