కూర రాజన్నపై కేసులు ఎత్తివేయాలి

జనశక్తి మాజీ నేత కూర రాజన్నపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేసి ఆయన్ను వెంటనే విడుదల చేయాలని పౌరహక్కుల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతా విప్లవ కార్యకర్తలు, ప్రజాసంఘాలపై అక్రమ కేసులు గతంలో

Published : 10 Aug 2022 04:49 IST

పౌరహక్కుల నేతల డిమాండ్‌

ఈనాడు, హైదరాబాద్‌: జనశక్తి మాజీ నేత కూర రాజన్నపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేసి ఆయన్ను వెంటనే విడుదల చేయాలని పౌరహక్కుల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతా విప్లవ కార్యకర్తలు, ప్రజాసంఘాలపై అక్రమ కేసులు గతంలో మాదిరిగానే కొనసాగడం విచారకరమన్నారు. ఈ మేరకు ప్రొఫెసర్‌ హరగోపాల్‌, జయవింధ్యాల, జీవన్‌కుమార్‌, కోదండరాం, వీఎల్‌ విశ్వేశ్వరరావు తదితరులు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని