విమానాశ్రయంలో బయోడీజిల్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్బన్‌ ఉద్గారాలను తగ్గించే దిశగా మరింత కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఇక్కడ ఉత్పత్తయ్యే సౌరవిద్యుత్తును పది కిలోవాట్లకు పెంచారు. తాజాగా దేశంలోని విమానాశ్రయాల్లోనే తొలిసారిగా

Published : 10 Aug 2022 04:49 IST

 ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్‌ సైతం అందుబాటులోకి...

ఈనాడు, హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్బన్‌ ఉద్గారాలను తగ్గించే దిశగా మరింత కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఇక్కడ ఉత్పత్తయ్యే సౌరవిద్యుత్తును పది కిలోవాట్లకు పెంచారు. తాజాగా దేశంలోని విమానాశ్రయాల్లోనే తొలిసారిగా బయోడీజిల్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు. బయోడీజిల్‌లో 11శాతం ఆక్సిజన్‌ ఉంటుంది. సల్ఫర్‌ ఉండదు. దీనివల్ల 80శాతం తక్కువ కార్బన్‌, వంద శాతం తక్కువ సల్ఫర్‌ డయాక్సైడ్‌ ఉద్గారాలు ఉత్పత్తవుతాయి. వాహనాల ఇంజిన్‌ జీవితం కాలం పెరుగుతుంది. విమానాశ్రయంలోని ప్రజారవాణా కేంద్రం(పీటీసీ) వద్ద ఈ కేంద్రం ఏర్పాటు చేశారు.

* విమానాశ్రయంలో 30 కిలోవాట్‌ సామర్థ్యంతో ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్‌ సైతం అందుబాటులోకి తెచ్చారు. దీన్ని ప్రధాన కారు పార్కింగ్‌ ప్రాంతం వద్ద ఏర్పాటుచేశారు. ఈ కేంద్రంలో గంటలో కారును పూర్తిగా ఛార్జింగ్‌ చేయవచ్చు. ఇక్కడ చెల్లింపులు మొదలుకుని నిర్వహణ వరకు యాప్‌లోనే చేయాల్సి ఉంటుంది. ఈవీ స్టేషన్‌ వల్ల ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగానికి ప్రోత్సాహం లభించనుందని విమానాశ్రయ సీఈవో ప్రదీప్‌ పణికర్‌ పేర్కొన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వద్ద కర్బన ఉద్గారాలను శూన్యస్థాయికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని