Artificial intelligence: కృత్రిమ మేధ పోటీల విజేత థింక్‌ ఎవాల్వ్‌ కన్సల్టెన్సీ

అడవుల్లోని జంతుజాలం సంఖ్య, వాటి కదలికలు, జీవన విధానంపై అధ్యయనం కోసం తెలంగాణ కృత్రిమ మేధ సంఘం నిర్వహించిన ఫారెస్ట్‌ ఏఐ గ్రాండ్‌ ఛాలెంజ్‌ పోటీల్లో విజేతగా థింక్‌ ఎవాల్వ్‌ కన్సల్టెన్సీ నిలిచింది. ఈ  పైలట్‌ ప్రాజెక్టు అమలు

Updated : 10 Aug 2022 05:10 IST

టీహబ్‌లో పురస్కార ప్రదానం

ఈనాడు, హైదరాబాద్‌: అడవుల్లోని జంతుజాలం సంఖ్య, వాటి కదలికలు, జీవన విధానంపై అధ్యయనం కోసం తెలంగాణ కృత్రిమ మేధ సంఘం నిర్వహించిన ఫారెస్ట్‌ ఏఐ గ్రాండ్‌ ఛాలెంజ్‌ పోటీల్లో విజేతగా థింక్‌ ఎవాల్వ్‌ కన్సల్టెన్సీ నిలిచింది. ఈ  పైలట్‌ ప్రాజెక్టు అమలు కోసం థింక్‌ ఎవాల్వ్‌కు రూ.20 లక్షల సాయం అందిస్తామని, మార్గనిర్దేశం చేస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తెలిపారు. మంగళవారం టీహబ్‌లో జరిగిన కార్యక్రమంలో విజేతకు ఆయన పురస్కారాన్ని అందజేశారు. తెలంగాణ అటవీశాఖ,  ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌ జెమినీలతో కలిసి పోటీలను నిర్వహించగా దీనికి దేశవ్యాప్తంగా 58 అంకుర సంస్థల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, వాటిని నిపుణులు పరిశీలించి విజేతను ఎంపిక చేశారని తెలిపారు. కార్యక్రమంలో అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి డోబ్రియాల్‌, టీహబ్‌ సీఈవో శ్రీనివాస్‌రావు, క్యాప్‌ జెమిని ఉపాధ్యక్షుడు అనురాగ్‌ ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

12 నుంచి 14 వరకు అంతర్జాతీయ యువజన సదస్సు

హైదరాబాద్‌లో ఈ నెల 12 నుంచి 14 వరకు  హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ అంతర్జాతీయ యువజన సదస్సు జరగనుంది. నగర శివార్లలోని కన్హా శాంతివనంలో దీనిని నిర్వహించనున్నారు. ఇందులో సుమారు పదివేల మంది పాల్గొంటారని సంస్థ ప్రతినిధి కమలేశ్‌ పాటిల్‌ మంగళవారం తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని