‘రైతునేస్తం’ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

‘రైతునేస్తం’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డా.ఐ.వి.సుబ్బారావు పేరిట వ్యవసాయ, అనుబంధ రంగాలలో విశేష సేవలు అందిస్తున్న శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు

Published : 11 Aug 2022 04:32 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: ‘రైతునేస్తం’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డా.ఐ.వి.సుబ్బారావు పేరిట వ్యవసాయ, అనుబంధ రంగాలలో విశేష సేవలు అందిస్తున్న శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, అగ్రి జర్నలిస్టులు, విస్తరణ అధికారులతో పాటు అగ్రి ఇన్నోవేషన్స్‌ నుంచి పురస్కారాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ‘రైతునేస్తం’ వెబ్‌సైట్‌ https://rythunestam.in/awards నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దానిని పూరించి, తమ పరిశోధనా వ్యాసాలను, సాగు అనుభవాలను జత పరిచి ఆగస్టు 31లోగా ‘ఎడిటర్‌’ రైతునేస్తం’ 6-2-959, దక్షిణభారత హిందీ ప్రచార సభ కాంప్లెక్స్‌, ఖైరతాబాద్‌, హైదరాబాద్‌-54, ఫోన్‌ నంబరు 9676797777లో సంప్రదించవచ్చు. లేదా రైతునేస్తం, 8-198, పుల్లడిగుంట దగ్గర, కొర్నెపాడు పోస్టు, వట్టిచెరుకూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌-522017కు పంపించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు 9706383666 నంబరులో సంప్రదించాలి. సెప్టెంబరులో జరగబోయే రైతునేస్తం వార్షికోత్సవాల్లో పురస్కార గ్రహీతలను ఘనంగా సత్కరిస్తామని రైతునేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌, రైతునేస్తం మాసపత్రిక సంపాదకుడు యడ్లపల్లి వేంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని