గ్రూప్‌-3, 4, డీఎస్సీ, గురుకుల పోస్టులకు బీసీ స్టడీసర్కిళ్లలో ప్రత్యక్ష తరగతులు

రాష్ట్రంలోని 50 బీసీ స్టడీసర్కిళ్ల పరిధిలో సెప్టెంబరు 1 నుంచి గ్రూప్‌-3, 4, డీఎస్సీ, గురుకుల ఉపాధ్యాయ పోస్టుల పోటీపరీక్షలకు ప్రత్యక్ష శిక్షణ ప్రారంభించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ కె.అలోక్‌కుమార్‌

Published : 11 Aug 2022 04:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 50 బీసీ స్టడీసర్కిళ్ల పరిధిలో సెప్టెంబరు 1 నుంచి గ్రూప్‌-3, 4, డీఎస్సీ, గురుకుల ఉపాధ్యాయ పోస్టుల పోటీపరీక్షలకు ప్రత్యక్ష శిక్షణ ప్రారంభించనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ కె.అలోక్‌కుమార్‌ తెలిపారు. గ్రూప్‌-3, 4 శిక్షణ కోసం పది, ఇంటర్‌, డిగ్రీలో 60 శాతం మార్కులు, డీఎస్సీ, గురుకుల పోస్టులకు బీఈడీలో 60 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు బీసీ స్టడీసర్కిల్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 25లోగా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 040-24071178 లేదా 040-27077929 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts