బోధన రుసుములు, ఉపకారవేతనాలకు 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ

రాష్ట్రంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ అభ్యర్థుల నుంచి 2022-23 విద్యాసంవత్సరానికి బోధన ఫీజులు, ఉపకారవేతనాలకు ఈ నెల 15 నుంచి అక్టోబరు 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు

Published : 11 Aug 2022 04:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ అభ్యర్థుల నుంచి 2022-23 విద్యాసంవత్సరానికి బోధన ఫీజులు, ఉపకారవేతనాలకు ఈ నెల 15 నుంచి అక్టోబరు 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎస్సీ సంక్షేమశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా తెలిపారు. కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఫ్రెషర్‌గా, ఇప్పటికే కోర్సులు చదువుతున్న అభ్యర్థులు తమ దరఖాస్తులు పునరుద్ధరించుకోవాలని పేర్కొన్నారు. కళాశాలల యాజమాన్యాలు గడువులోగా ఈ-పాస్‌లో రిజిస్టరు చేసుకోవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని