గురుకులాల్లో జీవో 317 అమలుకు కసరత్తు పూర్తి

రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు (జీవో నం.317) అమలు చేసేందుకు సొసైటీలు కసరత్తు పూర్తిచేశాయి. కొత్త పోస్టుల భర్తీకి ప్రకటనల జారీకి ముందుగా జీవో 317ను అమలు చేయాల్సి రావడంతో వారం, పది

Published : 11 Aug 2022 04:29 IST

 త్వరలోనే నియామక ఉత్తర్వుల జారీ

ఈ ఏడాదికి పనిచేస్తున్న చోటే విధులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు (జీవో నం.317) అమలు చేసేందుకు సొసైటీలు కసరత్తు పూర్తిచేశాయి. కొత్త పోస్టుల భర్తీకి ప్రకటనల జారీకి ముందుగా జీవో 317ను అమలు చేయాల్సి రావడంతో వారం, పది రోజులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాలు ఉద్యోగుల సీనియారిటీ, స్థానికత ప్రకారం సర్దుబాటు చేసే ప్రక్రియను కొలిక్కి తీసుకువచ్చాయి. సర్దుబాటు ప్రక్రియలో భాగంగా కొందరు టీచర్లు, ఉద్యోగులు ఇతర జోన్లు, మల్టీ జోన్లలోకి వెళ్లాల్సి వస్తోంది. జీవో ప్రకారం ఉద్యోగుల సర్దుబాటు ఉత్తర్వులు ఇస్తే, విద్యాసంవత్సరంపై ప్రభావం పడుతుందన్న ఆందోళన సొసైటీల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. 2022-23 విద్యాసంవత్సరానికి ఆయా ఉపాధ్యాయ, ఉద్యోగులు ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల్లో విధులు నిర్వహించాలని స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొనాలని నిర్ణయించాయి. ఇతర జోన్లు, మల్టీ జోన్లలోకి స్థానచలనం పొందే టీచర్లు, ఉద్యోగులు వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు సెలవు రోజుల్లో అక్కడ చేరేలా నిబంధనలు రూపొందిస్తామని సొసైటీ వర్గాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని