సెమ్స్‌ ఒలింపియాడ్‌కు దరఖాస్తుల ఆహ్వానం

జాతీయ స్థాయిలో 1-12 తరగతుల విద్యార్థులకు నిర్వహించే సెమ్స్‌ ఒలింపియాడ్‌-2023కు సెప్టెంబరు 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒలింపియాడ్‌ సమాచార పత్రం, కరపత్రాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం

Updated : 12 Aug 2022 06:37 IST

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ స్థాయిలో 1-12 తరగతుల విద్యార్థులకు నిర్వహించే సెమ్స్‌ ఒలింపియాడ్‌-2023కు సెప్టెంబరు 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒలింపియాడ్‌ సమాచార పత్రం, కరపత్రాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఒలింపియాడ్‌ కన్వీనర్‌ ఆరుకాల రామచంద్రారెడ్డి, కోఆర్డినేటర్‌ ఎస్‌ఎన్‌రెడ్డి మాట్లాడుతూ.. మొదట ప్రాథమిక పరీక్షలను విద్యార్థులు చదువుతున్న పాఠశాలల్లోనే నిర్వహిస్తామని, ఈ పరీక్షలు అక్టోబరు నుంచి డిసెంబరు వరకు దశల వారీగా ఉంటాయన్నారు. అందులో ప్రతిభ చూపిన వారిని మెయిన్‌కు ఎంపిక చేస్తామని, ఆ పరీక్షలు డిసెంబరు/ జనవరిలో జరుగుతాయని తెలిపారు. నాలుగోసారి ఒలింపియాడ్‌ను నిర్వహించబోతున్నామని, ప్రతిభావంతులకు రూ.కోటి విలువైన బహుమతులు అందజేస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని