ప్రైవేటు ఆస్పత్రులు బీఎంఎస్‌ పోర్టల్‌లో రిజిస్టరు చేసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన జననాల పర్యవేక్షణ వ్యవస్థ (బీఎంఎస్‌)లో ప్రైవేటు ఆసుపత్రులు తమ వివరాలను ఈ నెల 31లోగా రిజిస్టరు చేసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ

Published : 12 Aug 2022 05:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన జననాల పర్యవేక్షణ వ్యవస్థ (బీఎంఎస్‌)లో ప్రైవేటు ఆసుపత్రులు తమ వివరాలను ఈ నెల 31లోగా రిజిస్టరు చేసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. ఆసుపత్రిలో నమోదవుతున్న సాధారణ, సీ-సెక్షన్‌, అసిస్టెడ్‌ ప్రసవాల వివరాలను ఈ వ్యవస్థ ద్వారా నమోదు చేస్తామని తెలిపింది. ఆసుపత్రి ఐడీ ద్వారా రోజువారీగా ప్రసవ వివరాలను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని, పూర్తి వివరాలకు తమ జిల్లా వైద్యాధికారిని సంప్రదించాలని ప్రైవేటు ఆసుపత్రులకు సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని