తిరుపతికి వెళ్లే రెండు రైళ్ల దారి మళ్లింపు

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి 16, 17తేదీల్లో బయల్దేరి వెళ్లే రెండు రైళ్లను దారి మళ్లించి నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇందులో సెవెన్‌హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌తో పాటు, సికింద్రాబాద్‌-తిరుపతి

Published : 12 Aug 2022 07:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి 16, 17తేదీల్లో బయల్దేరి వెళ్లే రెండు రైళ్లను దారి మళ్లించి నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇందులో సెవెన్‌హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌తో పాటు, సికింద్రాబాద్‌-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ కూడా ఉన్నాయి. గుంతకల్లు రైల్వే డివిజన్‌ పరిధిలోని తాటిచెర్ల-జంగాలపల్లి సెక్షన్‌లో డబ్లింగ్‌ పనుల నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుందని తెలిపింది. ఇందులో సికింద్రాబాద్‌-తిరుపతి (నం.12770) మధ్య నడిచే సెవెన్‌హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌ను 16న దారి మళ్లిస్తారు. గుత్తి నుంచి రేణిగుంట మీదుగా ఈ రైలు తిరుపతికి చేరుతుంది. సాధారణంగా ఈ రైలు గుత్తి నుంచి ధర్మవరం, పీలేరు, పాకాల మీదుగా తిరుపతికి వెళుతుంది. అదేవిధంగా సికింద్రాబాద్‌-తిరుపతి (నం.12732) ఎక్స్‌ప్రెస్‌నూ 17న దారి మళ్లించి నడిపిస్తారు. గుత్తి నుంచి రేణిగుంట మీదుగా ఈ రైలు తిరుపతికి వెళుతుంది. వికారాబాద్‌, రాయచూరు మీదుగా వెళ్లే ఈ రైలు సాధారణంగా గుత్తి తర్వాత ధర్మవరం, పీలేరు, పాకాల మీదుగా తిరుపతికి చేరుకుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని