Published : 12 Aug 2022 07:06 IST

అభియోగపత్రం దాఖలులో తాత్సారం..

ఎమ్మెల్సీ అనంతబాబుకు సహకరించటమే?
దళిత యువకుడి హత్య కేసులో పోలీసుల తీరుపై అనుమానాలు

ఈనాడు, అమరావతి, కాకినాడ: దళిత యువకుడు, కారు డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అభియోగపత్రం దాఖలు చేయటంలో పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఏపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌(అనంతబాబు) బెయిల్‌ పొందేలా మార్గం సుగమం చేసేందుకు ప్రణాళిక ప్రకారం జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పదేళ్లు.. అంతకంటే ఎక్కువ శిక్ష పడేందుకు వీలున్న నేరాల్లో నిందితుడికి జ్యూడీషియల్‌ రిమాండు విధించిన నాటి నుంచి 90 రోజుల్లోగా అభియోగపత్రం వేయకపోతే అతను బెయిల్‌ పొందేందుకు ఆస్కారం లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అనంతబాబుకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బెయిల్‌కు మార్గం సుగమం చేసేందుకేనా?

మే 19న సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యారు. నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబును నాలుగు రోజుల తర్వాత మే 23న అరెస్టు చేశారు. అదే రోజు న్యాయమూర్తి ఆయనకు రిమాండు విధించారు. ఈ నెల 20 నాటికి ఆయన రిమాండులోకి వెళ్లి 90 రోజులు పూర్తవుతుంది. బెయిల్‌ కోరుతూ న్యాయస్థానాల్లో ఆయన వేసిన పిటిషన్‌లు ఇప్పటికే పలుమార్లు తిరస్కరణకు గురయ్యాయి. గడువు తేదీలోగా అభియోగపత్రం దాఖలు చేయకపోతే ఆయన బెయిల్‌ పొందేందుకు వీలు కలుగుతుంది. కేసు దర్యాప్తు తీరు, పోలీసుల నుంచి తగిన చొరవలేకపోవటం వంటి అంశాల్ని గమనిస్తే గడువులోగా అభియోగపత్రం దాఖలు కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని