21 నుంచి తొలి విడత కౌన్సెలింగ్‌

ఎంసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ధ్రువపత్రాల పరిశీలన 23 నుంచి మొదలవుతుంది. రెండో విడత కౌన్సెలింగ్‌ సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 8 వరకు జరుగుతుంది. ఈ మేరకు

Published : 13 Aug 2022 04:14 IST

సెప్టెంబరు 6న సీట్ల కేటాయింపు
కాలపట్టికను ప్రకటించిన ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ధ్రువపత్రాల పరిశీలన 23 నుంచి మొదలవుతుంది. రెండో విడత కౌన్సెలింగ్‌ సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 8 వరకు జరుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి ఛైర్మన్‌గా ఉన్న ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ సమావేశం కాలపట్టికను ఖరారు చేసింది. కౌన్సెలింగ్‌ మూడు విడతలుగా జరగనుంది. సెప్టెంబరు 11న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు వెల్లడవుతాయి. ఆ తరువాత రోజు నుంచి జోసా కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆరు రౌండ్ల కౌన్సెలింగ్‌కు 30-35 రోజుల సమయం పడుతుంది. అక్టోబరు 15-20 తేదీల మధ్య చివరి విడత జోసా కౌన్సెలింగ్‌ పూర్తవుతుందని అంచనా. ఈ నేపథ్యంలో ఎంసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ అక్టోబరు 11 నుంచి 21 వరకు నిర్వహించాలని నిర్ణయించారు.తొలి విడత వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 23 నుంచి మొదలవుతున్నందున 22వ తేదీ నాటికి ఫీజులపై ప్రభుత్వం జీఓ జారీ చేయాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని