Published : 13 Aug 2022 04:53 IST

ఎంసెట్‌ ఫలితాల్లో శ్రీచైతన్య ప్రభంజనం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌-2022 ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి రికార్డు సృష్టించారని శ్రీచైతన్య విద్యా సంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఇంజినీరింగ్‌, అగ్రి/ఫార్మసీ విభాగాలు రెండింటిలోనూ టాప్‌ టెన్‌ ర్యాంకుల్లో 70 శాతం తమ విద్యార్థులవేనన్నారు. ఇంజినీరింగ్‌ టాప్‌ వంద ర్యాంకుల్లో 56, అగ్రి/ఫార్మసీ టాప్‌ వంద ర్యాంకుల్లో 59 సాధించి ‘శ్రీచైతన్య’ తిరుగులేని సత్తా చాటిందని పేర్కొన్నారు. పోటీ పరీక్ష ఏదైనా, విధానాలు మారినా ప్రథమ స్థానంలో నిలిచేది తమ విద్యాసంస్థలేనని మరోసారి నిరూపితమైందన్నారు.

సత్తా చాటిన నారాయణ విద్యాసంస్థలు

ఎంసెట్‌ ఫలితాల్లో తమ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి సంచలనం సృష్టించారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ సింధూర నారాయణ, డైరెక్టర్‌ శరణి నారాయణలు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయిలో 1, 9, 10, 11 ర్యాంకులు కైవసం చేసుకున్నారన్నారు. ఇంజినీరింగ్‌ విభాగంలో టాప్‌ 100లో 30, అగ్రి/ఫార్మసీ విభాగంలో టాప్‌ వందలో 15 ర్యాంకులు ‘నారాయణ’ విద్యార్థులవేనన్నారు. తమ విద్యాసంస్థల పక్కా ప్రణాళికతోనే ఈ ఘన విజయాలు సాధించగలిగామని పేర్కొన్నారు.

ఎస్సార్‌ విద్యాసంస్థల ప్రతిభ

తమ విద్యార్థులు తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో ప్రతిభ చాటి మెరుగైన ర్యాంకులను సాధించారని ఎస్సార్‌ విద్యాసంస్థల ఛైర్మన్‌ ఎ.వరదారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఇంజినీరింగ్‌ విభాగంలో రాష్ట్రస్థాయిలో 29, 36, 41, 103 ర్యాంకులు, అగ్రి/ఫార్మసీ విభాగంలో 154 ర్యాంకు సాధించి తమ విద్యార్థులు విజయ పతాకాన్ని ఎగురవేశారన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని