ఈసెట్‌లో 19,954 మంది ఉత్తీర్ణత

ఈసెట్‌లో 19,954 మంది కనీస మార్కులు సాధించి కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. మొత్తం 22,001 మంది పరీక్షలు రాయగా వారిలో 19,954 మంది (90.69 శాతం)

Published : 13 Aug 2022 04:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఈసెట్‌లో 19,954 మంది కనీస మార్కులు సాధించి కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. మొత్తం 22,001 మంది పరీక్షలు రాయగా వారిలో 19,954 మంది (90.69 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఈసెట్‌ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం విడుదల చేశారు. లేటరల్‌ ఎంట్రీ ద్వారా బీటెక్‌, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి 10,300 సీట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈసెట్‌ కన్వీనర్‌ ఆచార్య కె.విజయ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మొత్తం 11 విభాగాల్లో పరీక్షలు జరిగాయని, బీఎస్‌సీ గణితం పూర్తి చేసిన వారూ 11 మంది ఈసారి పరీక్షలు రాశారన్నారు. మెకానికల్‌ విభాగంలో రామిరెడ్డి మనోజ్‌కుమార్‌రెడ్డి(కడప, ఏపీ), ఎలక్ట్రికల్‌లో గుగ్గిళ్ల ప్రణయ్‌(పాల్వంచ), సివిల్‌- ఎం.హేమంత్‌(విజయనగరం-ఏపీ), ఎలక్ట్రానిక్స్‌- సుంకేశుల సాయి మనస్వి( రైల్వే కోడూరు, ఏపీ), కంప్యూటర్‌ సైన్స్‌- కేశరాజు హారిక (హైదరాబాద్‌) ప్రథమ ర్యాంకు పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని