ప్రగతిభవన్‌లో ఘనంగా రక్షాబంధన్‌

హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో శుక్రవారం రక్షాబంధన్‌ వేడుకలు కోలాహలంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అక్కలు లలితమ్మ, లక్ష్మి, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టారు. అక్కలకు కేసీఆర్‌

Published : 13 Aug 2022 04:53 IST

సీఎంకు రాఖీలు కట్టిన సోదరీమణులు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో శుక్రవారం రక్షాబంధన్‌ వేడుకలు కోలాహలంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అక్కలు లలితమ్మ, లక్ష్మి, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ రాఖీలు కట్టారు. అక్కలకు కేసీఆర్‌ పాదాభివందనం చేసి.. ఆశీర్వాదాలు పొందారు. సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్‌, కుమార్తె, ఎమ్మెల్సీ కవితతో పాటు మనవడు, మనవరాలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కేటీఆర్‌ కుమారుడు హిమాన్షుకు సోదరి అలేఖ్య రాఖీ కట్టింది. అంతకుముందు మంత్రి కేటీఆర్‌కు సోదరి కవిత రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండగ సందర్భంగా తన సోదరి కవితతో కలిసి ఉన్న చిన్ననాటి ఫొటోలను మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. కొన్ని బంధాలు ఎంతో ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. తన కుమారుడు, కుమార్తెల ఫొటోనూ జతచేశారు.


సీఎం చిత్రపటాలకు రాఖీలు..

మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటాలకు తెరాస మహిళా నేతలు, కార్యకర్తలు రాఖీలు కట్టారు.

అసెంబ్లీ స్పీకర్‌ శ్రీనివాస్‌రెడ్డికి బాన్సువాడలోని ఆయన నివాసంలో సోదరి సత్యవతి, మండలి ఛైర్మన్‌ సుఖేందర్‌రెడ్డికి నల్గొండలో మహిళలు రాఖీలు కట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని