వీఆర్‌ఏల సర్వీసు వివరాల సేకరణ

గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) పే స్కేలు, ఉద్యోగ క్రమబద్ధీకరణ కోరుతూ గత నెల 25 నుంచి సమ్మె చేస్తుండగా మరోవైపు వారి సర్వీసు వివరాలు అందజేయాలంటూ పలు

Updated : 13 Aug 2022 06:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) పే స్కేలు, ఉద్యోగ క్రమబద్ధీకరణ కోరుతూ గత నెల 25 నుంచి సమ్మె చేస్తుండగా మరోవైపు వారి సర్వీసు వివరాలు అందజేయాలంటూ పలు కలెక్టరేట్ల నుంచి తహసీల్దార్లకు మెయిల్స్‌ వస్తున్నాయి. రెండు రకాల ప్రొఫార్మాలతో కూడిన సమాచారం అడుగుతున్నారు. అయితే భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ కార్యాలయం స్థాయిలో వీఆర్‌ఏల సమాచారం ఏదీ తాజాగా కోరలేదని తెలిసింది. దీంతో రెవెన్యూ శాఖలో ఏం జరుగుతుందో అని ఆసక్తి నెలకొంది. రెండేళ్ల కిందట వీఆర్వో వ్యవస్థను రద్దు చేయగా వారిని ఇటీవల ఇతర శాఖల్లో సర్దుబాటు చేశారు. ఇక పరిష్కరించాల్సింది వీఆర్‌ఏల పే స్కేలు, ఉద్యోగ క్రమబద్ధీకరణ వంటి అంశాలే. వీఆర్వోలను ఇతర శాఖలలో సర్దుబాటుచేయడం.. వీఆర్‌ఏలు సమ్మెలో ఉండటంతో మండలాల్లో క్షేత్ర స్థాయి విచారణ లేక రకరకాల ధ్రువపత్రాల విచారణ నిలిచిపోయింది. తహసీల్దార్లు, ఆర్‌ఐలపై పనిభారం పెరిగింది. దీనిపై జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో ధ్రువపత్రాల జారీ అధికారాన్ని కూడా పంచాయతీరాజ్‌శాఖకు బదలాయించే అవకాశాలు ఉన్నాయన్న చర్చ నడుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని