నేడు అల్పపీడనం, రేపు భారీ వర్షాలు

బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో శనివారం అల్పపీడనం ఏర్పడి, ఆదివారానికి ఇది మరింత బలపడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం

Published : 13 Aug 2022 04:52 IST

ఈనాడు, హైదరాబాద్‌:  బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో శనివారం అల్పపీడనం ఏర్పడి, ఆదివారానికి ఇది మరింత బలపడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు బాగా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ కేవలం 10 ప్రాంతాల్లో మాత్రమే కొద్దిపాటి జల్లులు పడ్డాయి. పగటి గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీలుంటోంది. వర్షాలు లేకపోవడంతో వ్యవసాయానికి, ఇళ్లలో కరెంటు వినియోగం పెరిగింది. శుక్రవారం గరిష్ఠ విద్యుత్‌ డిమాండు 11482 మెగావాట్లకు చేరింది. మూడు రోజుల క్రితం 9 వేల మెగావాట్లలోపు ఉండేది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని