వైద్య పోస్టుల దరఖాస్తులో దిద్దుబాటుకు వెసులుబాటు

వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ఆధ్వర్యంలో భర్తీ చేయనున్న 969 వైద్యుల పోస్టుల దరఖాస్తుల్లో తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం లభించింది. గత జూన్‌ 15న నియామక ప్రకటన వెలువడింది. అర్హులైన

Published : 13 Aug 2022 04:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ఆధ్వర్యంలో భర్తీ చేయనున్న 969 వైద్యుల పోస్టుల దరఖాస్తుల్లో తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం లభించింది. గత జూన్‌ 15న నియామక ప్రకటన వెలువడింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 14న సాయంత్రం 5 గంటలలోపు https://mhsrb.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు తమ సమాచారాన్ని తప్పుగా పొందుపర్చారు. తప్పులు దొర్లినట్లుగా అభ్యర్థుల నుంచి ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీకి వినతిపత్రాలొచ్చాయి. స్పందించిన ప్రభుత్వం తప్పులు దిద్దుబాటుకి మరోసారి అవకాశం కల్పించింది. ఈ నెల 14న తుదిగడువు లోగా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో.. వారికే దిద్దుబాటుకు అవకాశం ఉంటుందని ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ తేల్చిచెప్పింది. ఈ నెల 17న ఉదయం 10 గంటల నుంచి 24న సాయంత్రం 5 గంటల వరకూ దరఖాస్తుదారులు తమ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి తప్పులను సరిదిద్దుకోవచ్చని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని