ట్యాంక్‌బండ్‌పై నేడు చక్కర్లు కొట్టనున్న నిజాం కాలంనాటి బస్సు

స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 1932లో నిజాం స్టేట్‌ రైల్‌ అండ్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ నడిపిన బస్‌ నుంచి ప్రస్తుతం టీఎస్‌ఆర్టీసీ నడుపుతున్న గరుడ, ఒలెక్ట్రా ఏసీ బస్సులతో ప్రభుత్వం పరేడ్‌ ఏర్పాటుచేస్తోంది.

Updated : 13 Aug 2022 07:19 IST

ఈనాడు, హైదరాబాద్‌: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 1932లో నిజాం స్టేట్‌ రైల్‌ అండ్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ నడిపిన బస్‌ నుంచి ప్రస్తుతం టీఎస్‌ఆర్టీసీ నడుపుతున్న గరుడ, ఒలెక్ట్రా ఏసీ బస్సులతో ప్రభుత్వం పరేడ్‌ ఏర్పాటుచేస్తోంది. ‘గ్రాండ్‌ బస్‌ పరేడ్‌’ పేరిట శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ట్యాంక్‌బండ్‌పై ఈ కార్యక్రమం నిర్వహించనుంది. ఇందులో 7వ నిజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ప్రయాణించిన ‘అల్బేనియం’ బస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. డీజిల్‌తో నడిచే ఈ వాహనాన్ని రోడ్డెక్కించేందుకు ఉప్పల్‌ ఆర్టీసీ వర్క్‌ షాప్‌లో సిద్ధం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని