వేడుకగా శ్రావణ పౌర్ణమి గరుడసేవ

శ్రీవారి ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రావణ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి గరుడుడిపై సర్వాలంకారభూషితుడైన శ్రీ మలయప్పస్వామి వారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. కార్యక్రమంలో

Published : 13 Aug 2022 05:39 IST

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రావణ పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి గరుడుడిపై సర్వాలంకారభూషితుడైన శ్రీ మలయప్పస్వామి వారు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. కార్యక్రమంలో చినజీయర్‌స్వామి, తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి, సీవీఎస్‌వో నరసింహ కిషోర్‌, వీజీవో బాలిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

సర్వదర్శనానికి 17 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 17 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 63,754 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.3.63 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని