త్వరలోనే నూతన కలెక్టరేట్ల ప్రారంభం..!

ప్రారంభోత్సవానికి ఎదురుచూస్తున్న ఆ భవనాలకు త్వరలో మోక్షం లభించనుంది. జిల్లాల సంఖ్య పెరగడం, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండాలనే ఉద్దేశంతో సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయాలను

Published : 14 Aug 2022 05:16 IST

సిద్ధంగా ఎనిమిది సముదాయాలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రారంభోత్సవానికి ఎదురుచూస్తున్న ఆ భవనాలకు త్వరలో మోక్షం లభించనుంది. జిల్లాల సంఖ్య పెరగడం, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండాలనే ఉద్దేశంతో సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం 2018లో నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా 25 జిల్లాల్లో భవన సముదాయ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఆ తరవాత కరీంనగర్‌, ములుగు, నారాయణపేట జిల్లాల్లోనూ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. నిర్మాణాలు పూర్తి కావడంతో భువనగిరి, జనగామ, హనుమకొండ, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, వనపర్తిలలో సముదాయాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ప్రారంభించారు. మరో ఎనిమిది చోట్ల కూడా నిర్మాణాలు పూర్తయి ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నాయి. నిజామాబాద్‌, పెద్దపల్లి, జగిత్యాల, కొత్తగూడెం, మేడ్చల్‌, రంగారెడ్డి(శంషాబాద్‌), వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కొన్నింటిని త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకటీ రెండు రోజుల్లో ఏయే జిల్లాల భవన సముదాయాలను ప్రారంభిస్తారన్న స్పష్టత వస్తుందని చెబుతున్నారు. ఒక్కో సమీకృత భవన నిర్మాణానికి రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. 1.50 నుంచి 1.70 లక్షల చదరపు అడుగుల్లో వీటిని నిర్మిస్తోంది. నిర్మాణంలో ఉన్న సముదాయాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు పనులు ముమ్మరం చేశామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి నిర్మాణ వ్యవహారాలను సమీక్షిస్తున్నారన్నారు. ప్రస్తుతం పది జిల్లాల భవన సముదాయాల పనులు జరుగుతున్నాయని, కరీంనగర్‌ జిల్లా కలెక్టరేట్‌ పనులు ఇటీవలే ప్రారంభమైనట్లు తెలిపారు. ములుగు, నారాయణపేట భవన సముదాయాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసినట్లు ఆయన వివరించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts