కిష్టరాయిన్‌పల్లి జలాశయం పనుల అడ్డగింత

నల్గొండ జిల్లాలో డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మితమవుతున్న కిష్టరాయిన్‌పల్లి జలాశయం నిర్మాణ పనులను శనివారం నాంపల్లి మండలం లక్ష్మణాపురం భూ నిర్వాసితులు అడ్డుకున్నారు.

Published : 14 Aug 2022 05:16 IST

నాంపల్లి, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లాలో డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మితమవుతున్న కిష్టరాయిన్‌పల్లి జలాశయం నిర్మాణ పనులను శనివారం నాంపల్లి మండలం లక్ష్మణాపురం భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. ప్రాజెక్టులో భూములు, నివాసాలు కోల్పోతున్న తమకు మెరుగైన పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు గతంలో పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించారు. ఆందోళనలు నిర్వహిస్తున్నా అధికారులు పోలీసు బందోబస్తు నడుమ పనులు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ప్రాజెక్టు పనులను అడ్డుకోవడంతో పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా వారు ససేమిరా అన్నారు. ఇంతలోనే అక్కడికి చేరుకున్న పోలీసుల వాహనాల ఎదుట మహిళా నిర్వాసితులు అడ్డుగా కూర్చొని ఆందోళన చేశారు. అరెస్టు చేయాలంటూ వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మర్రిగూడ ఎస్సై వెంకట్‌రెడ్డి కాళ్లు మొక్కుతూ కనికరించాలంటూ ప్రాధేయపడ్డారు. మెరుగైన పరిహారం కోసమే ఆందోళన చేస్తున్నట్లు కన్నీరు పెట్టుకున్నారు. దీంతో అధికారులు శనివారం ప్రాజెక్టు పనులను చేపట్టకుండా నిలిపివేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని