ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ను నిలిపేయండి

ఇంజినీరింగ్‌ కళాశాలలను తనిఖీ చేయకుండా అనుబంధ గుర్తింపు ఇవ్వనుండడమే కాకుండా ఈ నెల 21 నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారని, దీన్ని నిలుపుదల చేయాలని తెలంగాణ

Published : 14 Aug 2022 05:28 IST

గవర్నర్‌, విద్యాశాఖ అధికారులకు టీఎస్‌టీసీఈఏ వినతిపత్రం సమర్పణ

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కళాశాలలను తనిఖీ చేయకుండా అనుబంధ గుర్తింపు ఇవ్వనుండడమే కాకుండా ఈ నెల 21 నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారని, దీన్ని నిలుపుదల చేయాలని తెలంగాణ స్కూల్స్‌ టెక్నికల్‌ కాలేజెస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌(టీఎస్‌టీసీఈఏ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఉద్యోగుల నుంచి స్వీకరించిన అభిప్రాయాలతో కూడిన నివేదికను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోష్‌కుమార్‌ శనివారం గవర్నర్‌ తమిళిసై, విద్యాశాఖ ఉన్నతాధికారులకు అందజేశారు. అధిక శాతం మంది అధ్యాపకులు తనిఖీలు అవసరమేనని, ఉద్యోగుల వేతనాలను కూడా పరిశీలించాలని సూచించినట్లు నివేదికలో పేర్కొన్నారు. గత ఏడాది జేఎన్టీయూహెచ్‌ నామమాత్రంగా తనిఖీలు చేయగా ఓయూ అసలే చేయలేదని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని