నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ బెంగాల్‌, ఒడిశాల మధ్య తీరం దాటనుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం తెలంగాణలో అక్కడక్కడ భారీగా,

Published : 15 Aug 2022 06:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ బెంగాల్‌, ఒడిశాల మధ్య తీరం దాటనుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం తెలంగాణలో అక్కడక్కడ భారీగా, మంగళవారం ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఈ శాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. వాయుగుండం వల్ల రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా ఐదారు డిగ్రీలు తగ్గి చల్లని వాతావరణం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో ఆదివారం పగలు ముసురుపట్టి సన్నని తుంపర కురిసింది. శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ములుగు జిల్లా మంగపేటలో 11.4, మల్లూరులో 9.9 తాడ్వాయిలో 8.9, ఏటూరునాగారంలో 7.7,  భద్రాద్రి జిల్లా కరకగూడెంలో 10, ఏడూళ్ల బయ్యారంలో 7, అశ్వాపురంలో 7, సీతారామపురంలో 7, మణుగూరులో 6, గుండాలలో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆదివారం పగలు ఓ మోస్తరు వర్షాలు ఎక్కువగా కురిశాయి. రాత్రి సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని నాగరత్న ప్రజలకు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని