70 రైల్వే స్టేషన్లలో ఫొటో ఎగ్జిబిషన్‌

జోన్‌లో ఆరు డివిజన్ల పరిధిలోని 70 రైల్వే స్టేషన్లలో ప్రత్యేక ఫొటో ప్రదర్శనను దక్షిణ మధ్య(ద.మ.) రైల్వే ఏర్పాటు చేసింది. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ సంబరాలలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే

Published : 15 Aug 2022 06:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: జోన్‌లో ఆరు డివిజన్ల పరిధిలోని 70 రైల్వే స్టేషన్లలో ప్రత్యేక ఫొటో ప్రదర్శనను దక్షిణ మధ్య(ద.మ.) రైల్వే ఏర్పాటు చేసింది. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ సంబరాలలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే దేశ విభజన నాటి చిత్రాలతో ఆదివారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. 55 చోట్ల ఫొటో ప్రదర్శన, మిగిలినచోట్ల డిజిటల్‌ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. దేశ విభజన వల్ల బాధితులైన లక్షలాది మంది వేదన, వాళ్లు పడ్డ కష్టాల్ని తెలిపే ఫొటోలను ప్రదర్శించారు. దేశ విభజన సమయంలో మన పూర్వీకులు అనుభవించిన కష్టాలను రైలు ప్రయాణికులు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ద.మ. రైల్వే తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని