వాగుపారినా ఎగిరిన జెండా

ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి జాతీయ జెండాను ఎగురవేసిన ఘటన ఇది. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం సేవాదాస్‌నగర్‌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హీరాలాల్‌ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం బడిలో

Published : 16 Aug 2022 05:25 IST

ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి జాతీయ జెండాను ఎగురవేసిన ఘటన ఇది. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం సేవాదాస్‌నగర్‌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హీరాలాల్‌ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం బడిలో జెండా ఆవిష్కరించేందుకు తన నివాసం ఇచ్చోడ నుంచి సేవాదాస్‌నగర్‌కు వస్తుండగా వాగు ప్రవాహం కారణంగా ఇబ్బందులు పడ్డారు. గ్రామ సమీపంలో ఉన్న వాగులో మెడ లోతు వరకు నీళ్లు పారుతుండటంతో దాటేందుకు ఆందోళన చెందారు. గమనించిన గ్రామస్థులు ఆయనను వాగు దాటించారు. జెండా ఎగురవేసిన అనంతరం తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలోనూ ఆయనకు గ్రామస్థులు అండగా నిలిచారు.

-న్యూస్‌టుడే, నేరడిగొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు