తెలుగు యోధుల పాత్ర చిరస్మరణీయం

స్వాతంత్య్ర సంగ్రామంలో తెలుగు యోధులను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఎన్‌జీ రంగా, గాడిచర్ల హరిసర్వోత్తమరావు,

Published : 16 Aug 2022 05:25 IST

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: స్వాతంత్య్ర సంగ్రామంలో తెలుగు యోధులను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఎన్‌జీ రంగా, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, టంగుటూరి ప్రకాశం పంతులు, తుర్రేబాజ్‌ ఖాన్‌, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌, బూర్గుల రామకృష్ణారావు, వావిలాల గోపాల కృష్ణయ్య, సర్దార్‌ గౌతు లచ్చన్నతో పాటు ఎంతోమంది స్వాతంత్య్రం కోసం పోరాడారని ఆయన కొనియాడారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఆంధ్ర అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రొఫెసర్‌ ఎన్‌జీ రంగా, డాక్టర్‌ అనంతశయనం అయ్యంగార్‌, వి.వి.గిరి, భోగరాజు పట్టాభిసీతారామయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు వంటి ప్రముఖ దేశభక్తుల ఆలోచనల నుంచి 1935లో ఆంధ్ర అసోసియేషన్‌ పుట్టడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ఆంధ్రా అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కోటగిరి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు నజీర్‌ ఖాన్‌, మేనేజింగ్‌ ట్రస్టీ మట్టా పశుపతి, కార్యదర్శి సిలార్‌ ఖాన్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని