Hyderabad News: ఉద్యమంపై ప్రసంగిస్తుండగా ఆగిన ఊపిరి

స్వాతంత్య్ర ఉద్యమంపై స్ఫూర్తిదాయకంగా ప్రసంగిస్తున్న గళం ఒక్కసారిగా ఆగిపోయింది. మహనీయుల త్యాగాలను వివరిస్తున్న వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలి..అసువులు బాశారు. ఉప్పల్‌ నియోజకవర్గంలోని

Updated : 16 Aug 2022 06:50 IST

కాప్రా, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర ఉద్యమంపై స్ఫూర్తిదాయకంగా ప్రసంగిస్తున్న గళం ఒక్కసారిగా ఆగిపోయింది. మహనీయుల త్యాగాలను వివరిస్తున్న వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలి..అసువులు బాశారు. ఉప్పల్‌ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్‌ వంపుగూడలోని లక్ష్మీ ఇలైట్‌ విల్లాస్‌ కాలనీలో సోమవారం ఉదయం జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఫార్మా వ్యాపారి ఉప్పల సురేష్‌ (56)  స్వతంత్ర ఉద్యమం, మహనీయుల త్యాగాలపై ప్రసంగిస్తుండగా ఛాతిలో నొప్పిరావడంతో కుప్పకూలారు. కాలనీ వాసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. జనగామ జిల్లా ఎర్రగొల్లపహాడ్‌కు చెందిన సురేష్‌ పాతికేళ్లక్రితమే నగరానికి వచ్చారు. ఫార్మాస్యూటికల్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. ఏటా పంద్రాగస్టు రోజున ఆయన యువతను చైతన్యపరిచే ప్రసంగాలు చేసేవారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆయనకు రెండు నెలల క్రితం హెర్నియా శస్త్రచికిత్స జరిగింది. కుమారుడు కళ్లముందే మరణించడంతో తండ్రి యాదగిరి కన్నీరుమున్నీరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని