Published : 16 Aug 2022 05:37 IST

తలసరి కరెంటు వినియోగం 73% అధికం: సీఎండీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర తలసరి కరెంటు వార్షిక వినియోగం జాతీయ సగటుకన్నా 73 శాతం అధికంగా ఉందని జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం విద్యుత్‌ సౌధాలో పతాకావిష్కరణ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘గతేడాది(2021-22) రాష్ట్ర తలసరి కరెంటు వినియోగం 2,012 యూనిట్లు కాగా.. జాతీయ సగటు 1,161 యూనిట్లు. రాష్ట్రం ఏర్పడిన ఏడాది తెలంగాణ తలసరి వినియోగం 1,196 యూనిట్లే. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి విద్యుత్‌ సరఫరా, పంపిణీ వ్యవస్థల పటిష్ఠానికి రూ.36,198 కోట్లు వెచ్చించాం’’ అని వివరించారు. మింట్‌ కాంపౌండ్‌లోని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఆవరణలో సంస్థ సీఎండీ రఘుమారెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర రోజువారీ విద్యుత్‌ డిమాండు 6,666 మెగావాట్లు ఉంటే.. గత మార్చిలో అత్యధికంగా 14,160 మెగావాట్లు నమోదైందని తెలిపారు.

అయిదేళ్లలో 10 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి: సింగరేణి

సింగరేణి ప్రాంతంలో 10 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించి మొత్తం గనుల నుంచి మరో అయిదేళ్లలో.. ఏటా 10 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి కృషిచేయాలని సంస్థ సీఎండీ శ్రీధర్‌ ఉద్యోగులకు పతాకావిష్కరణ సందర్భంగా సూచించారు.

 

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts