శ్రీశైలంలో మహాశివరాత్రిని తలపించిన రద్దీ

నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి సోమవారం మహా శివరాత్రిని తలపించేలా పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున 3 గంటలకే ప్రాతఃకాల పూజలు నిర్వహించి భక్తులను

Published : 16 Aug 2022 05:37 IST

శ్రీశైలం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి సోమవారం మహా శివరాత్రిని తలపించేలా పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజామున 3 గంటలకే ప్రాతఃకాల పూజలు నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. వరుస సెలవులు రావడంతో వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దేవస్థానం టోల్‌గేట్‌ నుంచి వలయ రహదారి పొడవునా భక్తుల వాహనాలు నిండిపోయాయి. ప్రధాన వీధులు, ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వసతి గదులు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని