మిద్దెపై పొట్టేళ్ల పెంపకం..

మిద్దెపై కూరగాయలు పండించడం మనకు తెలుసు. ఖమ్మం జిల్లా మధిరలో హనుమంతు అనే యువకుడు ఒకడుగు ముందుకేసి.. మిద్దెపై పొట్టేళ్లను పెంచుతూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. గతంలో ఓ దుకాణంలో గుమాస్తాగా పనిచేసిన.. ఈ యువకుడు

Published : 16 Aug 2022 06:17 IST

మిద్దెపై కూరగాయలు పండించడం మనకు తెలుసు. ఖమ్మం జిల్లా మధిరలో హనుమంతు అనే యువకుడు ఒకడుగు ముందుకేసి.. మిద్దెపై పొట్టేళ్లను పెంచుతూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. గతంలో ఓ దుకాణంలో గుమాస్తాగా పనిచేసిన.. ఈ యువకుడు ఇంటిపై రేకుల షెడ్డు ఏర్పాటు చేసి పొట్టేళ్ల పెంపకం చేపట్టారు. మూడు నెలల వయసున్న పిల్లలను ఒక్కోటి రూ.5-6 వేలకు కొనుగోలు చేసి.. మూడు నెలలపాటు పెంచి మార్కెట్‌లో రూ.10-12 వేలకు విక్రయిస్తున్నారు. ప్రతిసారీ 20 పొట్టేలు పిల్లలను మాత్రమే కొనుగోలు చేసి పెంచుతున్నారు. వాటి విక్రయాలతో ప్రతి మూడు నెలలకు రూ.లక్ష వరకూ ఆదాయాన్ని గడిస్తున్నట్లు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ‘‘పగలు రెండుసార్లు వాటిని బయటకు తోలుకెళ్లి ఖాళీ స్థలాల్లో పచ్చిగడ్డి మేపి తిరిగి డాబాపైకి తోలుతా. రోజంతా వాన ఉంటే పచ్చిగడ్డి తెచ్చి డాబాపైనే వాటికి మేత అందిస్తా. రెండు పూటలా డాబాపైన శుభ్రం చేసి.. వ్యాధులు రాకుండా బ్లీచింగ్‌ చల్లుతూ జాగ్రత్తలు తీసుకుంటున్నా. పశువైద్యుని సలహాతో వాటికి టీకాలు వేయిస్తా’’ అని వెల్లడించారు. 

- న్యూస్‌టుడే, మధిర

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని