ఎల్బ్రస్‌ శిఖరాగ్రంపై మంచిర్యాల చిన్నారి

తెలంగాణకు చెందిన చిన్నారి హస్వి(14) అరుదైన ఘనతను సాధించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐరోపాలోని అత్యంత ఎత్తయిన మౌంట్‌ ఎల్బ్రస్‌ను అధిరోహించింది. 24 గంటల వ్యవధిలో

Published : 17 Aug 2022 05:59 IST

మంచిర్యాల సిటీ, న్యూస్‌టుడే: తెలంగాణకు చెందిన చిన్నారి హస్వి(14) అరుదైన ఘనతను సాధించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐరోపాలోని అత్యంత ఎత్తయిన మౌంట్‌ ఎల్బ్రస్‌ను అధిరోహించింది. 24 గంటల వ్యవధిలో రెండువైపుల (తూర్పు, పడమర)నుంచి ఈ శిఖరాగ్రాన్ని అధిరోహించి జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. సముద్రమట్టానికి 5,642 మీటర్ల ఎత్తులో ఎల్బ్రస్‌ శిఖరాగ్రం ఉండగా పశ్చిమం నుంచి సోమవారం ఉదయం పూర్తి చేసింది. తూర్పు నుంచి కూడా (5,621 మీటర్ల ఎత్తు) మంగళవారం ఉదయం పూర్తి చేసుకుంది. 45 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు, -20 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ ఉష్ణోగ్రత, వాతావరణం అనుకూలంగా లేకపోయినా.. విజయవంతంగా అధిరోహించినట్లు హస్వి తెలిపింది. మంచిర్యాలకు చెందిన ఈ చిన్నారి తల్లిదండ్రులు మాధవి-వెంకట్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. హస్వి శామీర్‌పేటలోని స్కూల్‌ ఆఫ్‌ ఎక్సెలెన్షియాలో పదో తరగతి చదువుతోంది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts