నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులపై వివరణ ఇవ్వండి

రంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులు ఇవ్వడంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర పర్యావరణ శాఖతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) నోటీసులు జారీ

Published : 17 Aug 2022 05:59 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్జీటీ నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన నిమ్జ్‌కు పర్యావరణ అనుమతులు ఇవ్వడంపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర పర్యావరణ శాఖతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) నోటీసులు జారీ చేసింది. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ గణపతి దీక్షిత్‌ సహా పలువురు రైతులు ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ఎన్జీటీ జ్యుడిషియల్‌ సభ్యులు జస్టిస్‌ పుష్ప సత్యనారాయణ, డాక్టర్‌ కె.సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూవిచారణను వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని