శాసనసభాపతి పోచారానికి కరోనా

రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా సోకింది. జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో ఆయన వైద్యపరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయింది. ఆరోగ్యంగానే ఉండడంతో కొన్ని

Published : 17 Aug 2022 05:49 IST

కొత్తగా 406 కొవిడ్‌ కేసులు

ఈనాడు,హైదరాబాద్‌-కారేపల్లి,న్యూస్‌టుడే: రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా సోకింది. జలుబు, జ్వరం లక్షణాలు ఉండడంతో ఆయన వైద్యపరీక్షలు చేయించుకోగా కరోనా నిర్ధారణ అయింది. ఆరోగ్యంగానే ఉండడంతో కొన్ని రోజులు హోం ఐసొలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన, తనతో సన్నిహితంగా ఉన్న వారందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏమైనా లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని పోచారం సూచించారు. రాష్ట్రంలో కొత్తగా 406 కొవిడ్‌ కేసులు నమోదవగా.. మొత్తం బాధితుల సంఖ్య 8,29,873కు పెరిగింది. తాజాగా మరో 494 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ 8,22,667 మంది ఆరోగ్యవంతులయ్యారు.  రాష్ట్రంలో ప్రస్తుతం 3,095 మంది కొవిడ్‌తో చికిత్స పొందుతున్నారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు మంగళవారం వెల్లడించారు. తాజా ఫలితాల్లో హైదరాబాద్‌లో 177 మేడ్చల్‌ మల్కాజిగిరిలో 32, రంగారెడ్డిలో 27, యాదాద్రి భువనగిరిలో 16 చొప్పున కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మరో 88,411 కొవిడ్‌ టీకా డోసులను పంపిణీ చేశారు.

గురుకుల విద్యార్థులకు పాజిటివ్‌

ఖమ్మం జిల్లా కారేపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఎనిమిది మంది విద్యార్థులకు స్థానిక వైద్యశాలలో మంగళవారం కరోనా పరీక్షలు నిర్వహించారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts