రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి

ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై పిలుపునిచ్చారు. మంగళవారం రాజ్‌భవన్‌ వద్ద భారతీయ రెడ్‌క్రాస్‌ సొసైటీకి చెందిన నాలుగు సంచార రక్తసేకరణ వ్యాన్లను ఆమె ప్రారంభించారు. ఈ వ్యాన్లు

Published : 17 Aug 2022 05:36 IST

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై పిలుపునిచ్చారు. మంగళవారం రాజ్‌భవన్‌ వద్ద భారతీయ రెడ్‌క్రాస్‌ సొసైటీకి చెందిన నాలుగు సంచార రక్తసేకరణ వ్యాన్లను ఆమె ప్రారంభించారు. ఈ వ్యాన్లు నేరుగా దాతల వద్దకే వెళ్లి  రక్తాన్ని సేకరించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ వాహనాలను హనుమకొండ, హైదరాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ రెడ్‌క్రాస్‌ ప్రతినిధులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్‌క్రాస్‌ సొసైటీ ఛైర్మన్‌ అజయ్‌ మిశ్రా, గవర్నర్‌ కార్యదర్శి సురేంద్రమోహన్‌, రెడ్‌ క్రాస్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని