సర్వాంగ సుందరంగా సచివాలయం: సీఎం కేసీఆర్‌

కొత్త సచివాలయాన్ని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో, సాధ్యమైనంత వేగంగా పనులను పూర్తి

Published : 18 Aug 2022 04:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొత్త సచివాలయాన్ని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో, సాధ్యమైనంత వేగంగా పనులను పూర్తి చేయాలన్నారు. బుధవారం ఆయన నూతన సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రుల ఛాంబర్లు, సమావేశ మందిరాల పనులను తనిఖీ చేశారు. నిర్మాణం వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. శ్లాబుల నిర్మాణం, భవనం పైన డోమ్‌ల ఏర్పాటు, ఇంటీరియర్‌ పనులతో పాటు ఫర్నిచర్‌ విషయంలో నూతన నమూనాలను ఎంపిక చేసుకోవాలని సీఎం సూచించారు. సచివాలయ భవనసముదాయం ముందున్న 2 ఎకరాల ఖాళీ స్థలంతోపాటు ల్యాండ్‌ స్కేపింగ్‌, గ్రీనరీ పనులు అద్భుతంగా ఉండాలన్నారు. సందర్శకుల గదులు, గ్రిల్స్‌, రెడ్‌ స్టోన్‌, మురుగునీటిపారుదల పనులను చూశారు. సచివాలయం వెంట మట్టి నింపే పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సచివాలయానికి వచ్చే విదేశీ ప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సందర్శకులకు సౌకర్యవంతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కేసీఆర్‌ సూచించారు. సీఎం వెంట మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్‌, పీయూసీ ఛైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్‌రావు, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మైనంపల్లి హనుమంతరావు, కేపీ వివేకానంద, బేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌,  సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని