కొత్తగా 507 కొవిడ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా 507 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 8,30,380కి పెరిగింది. తాజాగా మరో 605 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ 8,23,272 మంది

Published : 18 Aug 2022 04:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 507 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 8,30,380కి పెరిగింది. తాజాగా మరో 605 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ 8,23,272 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 17న సాయంత్రం 5.30 గంటల వరకూ నమోదైన కరోనా సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు బుధవారం వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,997 క్రియాశీల కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 33,046 నమూనాలను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 3,70,76,711కు పెరిగింది. తాజా ఫలితాల్లో హైదరాబాద్‌లో కొత్తగా 205, రంగారెడ్డిలో 42, మల్కాజిగిరిలో 41, మేడ్చల్‌ నల్గొండలో 23, కరీంనగర్‌లో 22, ఖమ్మంలో 15, మంచిర్యాలలో 15, మహబూబ్‌నగర్‌లో 12, సంగారెడ్డిలో 11, యాదాద్రి భువనగిరిలో 10 చొప్పున పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో మరో 1,15,628 కొవిడ్‌ టీకా డోసులను పంపిణీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని