సీఈఎస్‌ఎస్‌ ఎన్నికల షెడ్యూలు వివరాలు ఇవ్వండి

రాజన్న సిరిసిల్ల జిల్లా కోఆపరేటివ్‌ ఎలక్ట్రిక్‌ సప్లయ్‌ సొసైటీ లిమిటెడ్‌ (సీఈఎస్‌ఎస్‌) ఎన్నికల షెడ్యూలును ఈ నెల 22లోగా సమర్పించాలంటూ ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు ఆదేశాలు

Published : 18 Aug 2022 05:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా కోఆపరేటివ్‌ ఎలక్ట్రిక్‌ సప్లయ్‌ సొసైటీ లిమిటెడ్‌ (సీఈఎస్‌ఎస్‌) ఎన్నికల షెడ్యూలును ఈ నెల 22లోగా సమర్పించాలంటూ ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 3.5 లక్షలకు పైగా సభ్యులున్న సహకార సంఘం పాలక కమిటీ గడువు ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా గడువు పొడిగిస్తుండటంతోపాటు దీనికి సంబంధించి జారీ చేసిన జీవో 151ను సవాలు చేస్తూ సొసైటీ సభ్యుడు ఎ.కనకయ్య హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ సి.వి.భాస్కర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం ఎన్నికల షెడ్యూలు సమర్పించాక అన్ని అంశాలను పరిశీలిస్తామంటూ విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని