హైదరాబాద్‌లో టీఎస్‌ఎస్‌సీ కేంద్రం

భవిష్యత్తు టెక్నాలజీలు, 5జీ రంగంలో నైపుణ్యత కలిగిన మానవ వనరుల కోసం హైదరాబాద్‌లో టెలికం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ (టీఎస్‌ఎస్‌సీ) సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు

Published : 18 Aug 2022 05:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: భవిష్యత్తు టెక్నాలజీలు, 5జీ రంగంలో నైపుణ్యత కలిగిన మానవ వనరుల కోసం హైదరాబాద్‌లో టెలికం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ (టీఎస్‌ఎస్‌సీ) సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేయనుందని ఐటీశాఖ కార్యదర్శి జయేష్‌రంజన్‌ తెలిపారు. బుధవారమిక్కడ టెలికం మంథన్‌ - 2022లో భాగంగా జరిగిన కార్యక్రమంలో తెలంగాణలోని యువతకు శిక్షణ కోసం టీఎస్‌ఎస్‌సీ, టాస్క్‌ ఒప్పందం కుదుర్చుకున్నాయి. 5జీ, ఐవోటీ, డ్రోన్‌ తదితర రంగాల్లో శిక్షణకు ఈ ఏడాదిలో కేంద్రం అందుబాటులోకి వస్తుందని టీఎస్‌ఎస్‌సీ సీఈవో అర్వింద్‌ బాలి తెలిపారు. రానున్న రెండేళ్లలో దాదాపు లక్ష మంది యువతకు నైపుణ్య శిక్షణ కల్పించి ఉద్యోగాలకు సిద్ధంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌ సీఈవో శ్రీకాంత్‌ సిన్హా  పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని