‘ఎనీ డిగ్రీ’తో పెరిగిన పోటీ

తొలిసారిగా సోషల్‌ సైన్స్‌లోని 14 కోర్సులు, ఆర్ట్స్‌లోని ఎంఏ ఆంగ్లం, తెలుగు, ఫిలాసఫీ కోర్సుల్లో ఏ డిగ్రీ పూర్తి చేసినా పీజీలో ప్రవేశాలు పొందే వెసులుబాటు ఇవ్వడంతో పలు సబ్జెక్టులకు దరఖాస్తుల సంఖ్య పెరిగింది. బీఏ చదివిన వారే

Published : 18 Aug 2022 05:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: తొలిసారిగా సోషల్‌ సైన్స్‌లోని 14 కోర్సులు, ఆర్ట్స్‌లోని ఎంఏ ఆంగ్లం, తెలుగు, ఫిలాసఫీ కోర్సుల్లో ఏ డిగ్రీ పూర్తి చేసినా పీజీలో ప్రవేశాలు పొందే వెసులుబాటు ఇవ్వడంతో పలు సబ్జెక్టులకు దరఖాస్తుల సంఖ్య పెరిగింది. బీఏ చదివిన వారే కాకుండా ఈసారి బీటెక్‌, మరికొన్ని ఇతర విద్యార్హతలు ఉన్నవారు పోటీపడుతుండడంతో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, చరిత్ర తదితరాలకు దరఖాస్తులు పెరిగాయని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి తెలిపారు.

బీఏలో ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ కోర్సు: రాష్ట్రంలో సుమారు 15 రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం బీఏ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ కోర్సును ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి వెల్లడించారు.

22 నుంచి డీఈఈసెట్‌ ధ్రువపత్రాల పరిశీలన: రాష్ట్రంలో డీఈఈసెట్‌లో ఉత్తీర్ణులైన వారికి ఈనెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని కన్వీనర్‌ శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో తెలిపారు. పాత జిల్లా కేంద్రాల్లోని డైట్‌ కళాశాలల్లో పరిశీలన జరుగుతుందని, పూర్తి వివరాలను డీఈఈసెట్‌ వెబ్‌సైట్‌ నుంచి తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని