రాముడి భూమిని పంచాల్సిందే

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ భూమిని ఆక్రమించుకున్న వారు బుధవారం ఆందోళన ఉద్ధృతం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాకలో రెండు రోజులుగా భద్రాద్రి రాముడి మాన్యం భూమిని

Published : 18 Aug 2022 05:07 IST

ఆంధ్ర-తెలంగాణ సరిహద్దులో రాస్తారోకో

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ భూమిని ఆక్రమించుకున్న వారు బుధవారం ఆందోళన ఉద్ధృతం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాకలో రెండు రోజులుగా భద్రాద్రి రాముడి మాన్యం భూమిని ఆక్రమించుకొని అక్కడే వంటావార్పు చేసుకొంటున్న విషయం తెలిసిందే. బుధవారం తాజాగా ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ సరిహద్దు ప్రాంతాన్ని ముట్టడించి గంటకుపైగా రాస్తారోకో చేయడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. భద్రాచలం ఐటీడీఏ దారి గుండా అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి ప్రవేశించడానికి ఇది దగ్గరి మార్గం. నిత్యం వేలాది మంది తిరిగే రోడ్డు కావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాముడి భూమిని పంచాల్సిందే అని, తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని ఆక్రమణదారులు స్పష్టం చేశారు. అధికారులు వచ్చి నచ్చచెబుతున్నప్పటికీ ధర్నాను ఆపేది లేదని తేల్చి చెప్పారు. పట్టణ సీఐ నాగరాజు సంఘటన స్థలానికి చేరుకుని వారి డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. ఈ దారి మీద రాకపోకలను ఆపొద్దని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చినప్పటికీ అక్కడ నుంచి కదల్లేదు. గంటపాటు రాస్తారోకో చేసి తిరిగి ఆక్రమించుకున్న భూముల వద్దకు వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని