కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నేటి నుంచే హాల్‌టికెట్లు

కానిస్టేబుల్‌ తత్సమాన ఉద్యోగాలకు నిర్వహించే ప్రాథమిక రాత పరీక్షకు ఈ నెల 18వ తేదీ నుంచి హాల్‌టికెట్లు జారీచేస్తున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. పోలీసుశాఖలో 15,644,

Published : 18 Aug 2022 04:51 IST

ఈనాడు, హైదరాబాద్‌: కానిస్టేబుల్‌ తత్సమాన ఉద్యోగాలకు నిర్వహించే ప్రాథమిక రాత పరీక్షకు ఈ నెల 18వ తేదీ నుంచి హాల్‌టికెట్లు జారీచేస్తున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. పోలీసుశాఖలో 15,644, రవాణాశాఖలో 63, ఆబ్కారీశాఖలో 614 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఈ నెల 28వ తేదీన రాత పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరిగే ఈ పరీక్షకు 6,61,196 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,601 కేంద్రాలు ఏర్పాటుచేశారు. అభ్యర్థులు 18వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 26వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకూ హాల్‌ టికెట్లు ‌www.tslprb.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని శ్రీనివాసరావు తెలిపారు. డౌన్‌లోడ్‌ ప్రక్రియలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే support@tslprb.in కు ఈమెయిల్‌ లేదా 9393711110, 9391005006కు ఫోన్‌ చేయాలని సూచించారు.

అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌ను ప్రింట్‌ (కలర్‌లోనే తీసుకోవాలన్న నిబంధన ఏమీ లేదు) తీసుకోవాలి.

అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను కూడా కాగితానికి మరోవైపు ప్రింట్‌ తీసుకోవాలి.

దరఖాస్తు సమయంలో అభ్యర్థులు అప్‌లోడ్‌ చేసిన ఫొటోను హాల్‌టికెట్‌పై అతికించాలి. వేరే దాన్ని అతికించినా, హాల్‌టికెట్‌ అసమగ్రంగా ఉన్నా అనుమతించరు.

ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఉండదు.

పరీక్ష రాస్తున్నప్పుడు అభ్యర్థుల డిజిటల్‌ వేలిముద్ర తీసుకుంటారు. పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థులకు సంబంధించిన సామగ్రి భద్రపరుచుకునే సదుపాయం ఉండదు.

చేతి గడియారాలతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలనూ కేంద్రాల్లోకి అనుమతించరు.

హాల్‌టికెట్లను నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకూ భద్రపరచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని