లాసెట్‌లో 74 శాతం ఉత్తీర్ణత

తెలంగాణ లాసెట్‌లో 74 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 28,921 మంది పరీక్షలు రాయగా వారిలో 21,662 మంది కనీస మార్కులు పొంది కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య

Updated : 18 Aug 2022 05:52 IST

బీటెక్‌, ఎంబీబీఎస్‌ సహా పలు డిగ్రీల వారి ఆసక్తి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ లాసెట్‌లో 74 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 28,921 మంది పరీక్షలు రాయగా వారిలో 21,662 మంది కనీస మార్కులు పొంది కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, ఓయూ వీసీ రవీందర్‌, కన్వీనర్‌ జీబీ రెడ్డి తదితరులు బుధవారం సాయంత్రం ఈ ఫలితాలను విడుదల చేశారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో తొలి 10 ర్యాంకర్లలో ఏపీ అభ్యర్థులు ఒకటి, రెండు, ఏడు, తొమ్మిది ర్యాంకులు సాధించారు. ఎల్‌ఎల్‌ఎం విభాగంలో మొదటి 10 ర్యాంకర్లలో నలుగురు అమ్మాయిలు ఉన్నారు. ఎల్‌ఎల్‌బీ అయిదేళ్ల కోర్సులో ముగ్గురు అమ్మాయిలు టాప్‌-10 ర్యాంకర్లలో నిలవగా మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో టాప్‌ టెన్‌లో ఒక్కరికీ స్థానం దక్కలేదు. ఈ సందర్భంగా ఆచార్య లింబాద్రి మాట్లాడుతూ బీటెక్‌తో పాటు ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఫార్మా- డి, బి. ఫార్మసీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఆర్కిటెక్చర్‌ తదితర 21 రకాల కోర్సులు పూర్తి చేసిన వారు న్యాయవిద్యపై ఆసక్తితో లాసెట్‌ రాశారని తెలిపారు. డిగ్రీ పరీక్షల ఫలితాలు వెల్లడై... బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) ఆమోదం లభించిన తర్వాత కౌన్సెలింగ్‌ మొదలవుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు వి.వెంకటరమణ, కార్యదర్శి శ్రీనివాసరావు, ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

మూడేళ్ల ఎల్‌ఎల్‌బీకి 15,031 మంది, అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీకి 4256, ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు 2375 మంది అర్హత సాధించారు.

అబ్బాయిల్లో 15,619 మంది, అమ్మాయిలు 6,041 మంది ఉత్తీర్ణులయ్యారు. ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు పరీక్ష రాయగా.. ఇద్దరు అర్హత సాధించారు. దివ్యాంగులు 211 మంది పరీక్ష రాయగా, 161 మంది ఉత్తీర్ణులయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు