నేడు ఆర్టీసీ పాలకవర్గ సమావేశం

స్వచ్ఛంద ఉద్యోగ విరమణ అమలు నేపథ్యంలో పాలకవర్గం నుంచి తుది ఆమోదంతో పాటు బ్యాంకుల నుంచి రుణాలు, ప్రభుత్వ చేయూత తదితర అంశాలను చర్చించేందుకు తెలంగాణ

Published : 18 Aug 2022 05:47 IST

ఈనాడు, హైదరాబాద్‌: స్వచ్ఛంద ఉద్యోగ విరమణ అమలు నేపథ్యంలో పాలకవర్గం నుంచి తుది ఆమోదంతో పాటు బ్యాంకుల నుంచి రుణాలు, ప్రభుత్వ చేయూత తదితర అంశాలను చర్చించేందుకు తెలంగాణ ఆర్టీసీ పాలకవర్గ సమావేశం గురువారం జరగనుంది. గడిచిన సమావేశంలో వీఆర్‌ఎస్‌ అమలు చేసేందుకు సూత్రప్రాయ ఆమోదాన్ని పొందారు. అప్పట్లో ప్యాకేజీకి అనుమతి తీసుకోలేదు. తాజా సమావేశంలో దానితోపాటు నూతన బస్సులు కొనుగోలుకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అంతగా ముందుకు రాని పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్లాలి? ఉద్యోగులకు చెల్లించాల్సిన వివిధ బకాయిలు తదితర అంశాలను సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని