Published : 18 Aug 2022 05:47 IST

స్వస్థ్‌ రథం.. 120 రకాల వైద్య పరీక్షలు

స్వస్థ్‌ రథం..కంటైనర్‌ వాహనంలో అన్ని సదుపాయాలతో నిర్వహిస్తున్న మొబైల్‌ ఆసుపత్రి ద్వారా బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలంలో వైద్య శిబిరం నిర్వహించారు. చెన్నై కేంద్రంగా సేవలందిస్తున్న అపీరాన్‌ (ఏపీఈఐఆర్‌ఓఎన్‌) మొబైల్‌ మెడికేర్‌ మిషన్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వాహనానికి స్వస్థ్‌ రథ్‌గా నామకరణం చేశారు. మినీ ఆసుపత్రిలా ఉన్న ఈ వాహనంలో 120 రకాల వైద్య పరీక్షలు, సేవలు అందిస్తున్నారు. ఆదిలాబాద్‌ ఎస్పీ డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు స్వచ్ఛంద సంస్థ ఎండీ దాసరి శ్రీనివాస్‌ ఈ సేవలు అందించేందుకు ముందుకు వచ్చారు. ఏజెన్సీలోని మూడు ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. బుధవారం నార్నూరు మండలం ఖైర్‌డాట్వా గ్రామంలో తొలి శిబిరం నిర్వహించి 150 మందికి సేవలు అందించారు.  

- న్యూస్‌టుడే, నార్నూర్‌

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని