మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్‌మెంట్‌

ఒక వ్యక్తి మూడో కంటికి అనుమానం రాకుండా రెండు ఉద్యోగాలు చేశాడు. ఆ రెండు చోట్లా రిటైర్‌య్యాడు కూడా. పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే జిల్లా ట్రెజరీ అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌

Updated : 19 Aug 2022 07:13 IST

పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే గుర్తించిన ట్రెజరీ అధికారులు

సుబేదారి, న్యూస్‌టుడే: ఒక వ్యక్తి మూడో కంటికి అనుమానం రాకుండా రెండు ఉద్యోగాలు చేశాడు. ఆ రెండు చోట్లా రిటైర్‌య్యాడు కూడా. పింఛను కోసం దరఖాస్తు చేసుకుంటే జిల్లా ట్రెజరీ అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కిషన్‌పురాకు చెందిన ఎస్‌కే సర్వర్‌ రెండు వేర్వేరు తేదీల్లో పుట్టినట్టుగా ధ్రువపత్రాలు తీసుకొని ఒకటి కాకతీయ విశ్వవిద్యాలయంలో.. మరొకటి పోలీసుశాఖలో పెట్టి అటెండర్‌ ఉద్యోగాలు చేశాడు. రెండు చోట్లా పదవీ విరమణ పొంది పింఛను కోసం డీటీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు పరిశీలిస్తున్నప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో డీటీవో.. వరంగల్‌ సీపీ తరుణ్‌జోషికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. రెండు చోట్లా ఒకేసారి ఉద్యోగాలు ఎలా చేశాడనేది విచారణలో తేలుతుందని పోలీసులు తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని