‘గాంధీ’ చిత్రానికి ఆదరణ

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం థియేటర్లలో ప్రదర్శిస్తున్న ‘గాంధీ’ చిత్రాన్ని గురువారం వరకు 22.50 లక్షల మంది విద్యార్థులు తిలకించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 9 నుంచి 552 థియేటర్లలో ఈ చిత్రాన్ని

Published : 19 Aug 2022 03:06 IST

22.50 లక్షల మంది విద్యార్థుల వీక్షణ

ఈనాడు, హైదరాబాద్‌: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం థియేటర్లలో ప్రదర్శిస్తున్న ‘గాంధీ’ చిత్రాన్ని గురువారం వరకు 22.50 లక్షల మంది విద్యార్థులు తిలకించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 9 నుంచి 552 థియేటర్లలో ఈ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తుండగా.. మరో 3రోజుల పాటు ఇది కొనసాగనుంది. విద్యార్థుల నుంచి ఆదరణ లభిస్తున్నందున చిత్ర ప్రదర్శనను మరికొన్ని రోజులు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. తెలంగాణ మాదిరే ‘గాంధీ’ చిత్ర ప్రదర్శనకు ఆసక్తి చూపుతున్న ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల ప్రభుత్వాలు.. అందుకు సంబంధించిన సమాచారాన్ని సీఎస్‌ను అడిగి తెలుసుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని