తెలంగాణ వీరత్వానికి ప్రతీక సర్వాయి పాపన్నగౌడ్‌

సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్‌ ప్రదర్శించిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని రాష్ట్రం కొనసాగిస్తుందని తెలిపారు

Updated : 19 Aug 2022 05:59 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: సర్దార్‌ సర్వాయి పాపన్నగౌడ్‌ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్‌ ప్రదర్శించిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని రాష్ట్రం కొనసాగిస్తుందని తెలిపారు. గురువారం పాపన్నగౌడ్‌ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆయనకు నివాళులర్పించారు. ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాచరిక పోకడలకు వ్యతిరేకంగా వర్గాలను ఏకం చేసి బలహీనవర్గాల ఆత్మగౌరవ శక్తిగా పాపన్న పోరాడిన తీరు గొప్పదని సీఎం అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ బడుగు, బలహీనవర్గాల నాయకత్వాన్ని సముచితంగా గౌరవించుకుంటోందని తెలిపారు.

గాంధీభవన్‌లో..

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి వేడుకలను గురువారం గాంధీభవన్‌లో నిర్వహించారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని