గ్రామపంచాయతీలకు సొంత భవనాలు: ఎర్రబెల్లి

తెలంగాణలోని అన్ని గ్రామపంచాయతీలకు సొంత భవనాలు సమకూర్చుతామని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. రాష్ట్రంలో 4,745 పంచాయతీ భవనాలను నిర్మించాల్సి ఉందని, ప్రాధాన్య క్రమంలో వీటిని మంజూరు

Published : 19 Aug 2022 03:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని అన్ని గ్రామపంచాయతీలకు సొంత భవనాలు సమకూర్చుతామని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. రాష్ట్రంలో 4,745 పంచాయతీ భవనాలను నిర్మించాల్సి ఉందని, ప్రాధాన్య క్రమంలో వీటిని మంజూరు చేస్తామని పేర్కొన్నారు. కొత్త భవనాల నిర్మాణానికి కొన్నిచోట్ల నుంచి ఇంకా ప్రతిపాదనలు రావాల్సి ఉందన్నారు. కొత్త పంచాయతీ భవనాల నిర్మాణంపై గురువారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గిరిజన తండాల్లో 1,097, ఏజెన్సీ ప్రాంతాల్లో 688, మైదాన ప్రాంతాల్లో 2,960 గ్రామపంచాయతీలకు భవనాలు నిర్మించాల్సిన అవసరముందని అధికారులు వివరించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్‌ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టీనా, పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ హన్మంతరావు పాల్గొన్నారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts